మెగా కుటుంబానికి మరో అరుదైన గౌరవం దక్కింది. నిహారిక కొణిదెల(Niharika Konidela) నిర్మాతగా వ్యవహరించిన ‘కమిటీ కుర్రోళ్లు’( Committee Kurrollu) సినిమా జాతీయ అవార్డు సాధించడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ విజయంపై నిహారిక స్పందిస్తూ, తన కెరీర్‌లో ఇది ఎంతో ప్రత్యేకమైన క్షణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నిహారికను అభినందించారు.
గతంలో ‘రుద్రవీణ’ సినిమాకు నాగబాబు జాతీయ అవార్డు అందుకున్నారని, ఇప్పుడు నువ్వు నిర్మాతగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో గర్వంగా ఉందంటూ ప్రశంసించారు. కుటుంబంలో మరోసారి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. చిరంజీవి ప్రశంసలపై నిహారిక భావోద్వేగంగా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి గర్వకారణమని, అలాంటి గొప్ప వ్యక్తి తనను ప్రశంసించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని అన్నారు.
చిరంజీవి తనను ‘తోపు’ అంటూ అభినందించడం చాలా ప్రత్యేకంగా అనిపించిందని, ఆ మాటలు తనకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చాయని చెప్పారు. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా ద్వారా నిర్మాతగా నిహారికకు వచ్చిన ఈ గుర్తింపు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిన్న సినిమాలకు కూడా మంచి కథ, నాణ్యమైన నిర్మాణంతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుందని ఈ విజయం మరోసారి నిరూపించిందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Rohit Sharma | వాళ్ల పని వాళ్లు చేస్తారు.. నా పని నేను చేస్తా: హిట్మ్యాన్ వ్యాఖ్యలు








