Friday, July 3, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsRevolt RVX | యువత కోసం కొత్త EV బైక్ RVX.. ఫీచర్లు అదిరిపోయాయి, ధర,...

Revolt RVX | యువత కోసం కొత్త EV బైక్ RVX.. ఫీచర్లు అదిరిపోయాయి, ధర, స్పెక్స్ ఇవే

-

Chat on WhatsApp

Revolt RVX: భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో మరో కొత్త మోడల్ ప్రవేశించింది. దేశీయ EV తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ తన తాజా ఎలక్ట్రిక్ బైక్ RVXను మార్కెట్లో విడుదల చేసింది. యువత అవసరాలు, రోజువారీ ప్రయాణాలు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను రూపొందించారు.

ధర విషయానికి వస్తే, Revolt RVX ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.30 లక్షలుగా నిర్ణయించారు. కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా ఈ బైక్‌ను విక్రయించనుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ బైక్‌లో 4kW మిడ్-డ్రైవ్ PMSM మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 5.3kW పవర్‌ను అందించగలదు. 0 నుంచి 40 kmph వేగాన్ని కేవలం 3.9 సెకన్లలో చేరగల సామర్థ్యం ఈ బైక్ ప్రత్యేకత. బూస్ట్ మోడ్‌లో గరిష్ట వేగం 90 kmph వరకు ఉంటుంది.

బ్యాటరీ విభాగంలో 3.24kWh సామర్థ్యం గల రిమూవబుల్ NMC ప్యాక్‌ను అందించారు. IDC రేంజ్ ప్రకారం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో 0 నుంచి 80 శాతం వరకు కేవలం 80 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. టెక్నాలజీ పరంగా RVXలో 3.5 అంగుళాల IP67 రేటింగ్ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, OTA అప్‌డేట్స్, టెలిమాటిక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రైడింగ్ కోసం ఎకో, సిటీ, స్పోర్ట్, బూస్ట్ వంటి మోడ్స్‌తో పాటు జియోఫెన్సింగ్, వాహన లొకేషన్, కాల్ అలర్ట్స్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

సస్పెన్షన్ కోసం ముందు USD ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సెటప్‌ను ఇచ్చారు. ఇది రైడింగ్ సమయంలో మరింత స్థిరత్వాన్ని అందిస్తుంది. ఈ బైక్ పెర్ల్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, ఎక్లిప్స్ రెడ్ రంగుల్లో లభిస్తుంది మొత్తంగా చూస్తే, మంచి రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఆధునిక స్మార్ట్ ఫీచర్లతో Revolt RVX భారత ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో యువతను లక్ష్యంగా చేసుకుని బలమైన పోటీ ఇవ్వనున్న మోడల్‌గా కనిపిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

chandrababu naidu launches jsw rayalaseema steel plant in kadapa district

CM Chandrababu Naidu | రాయలసీమను ‘ఉక్కుసీమ’గా మారుస్తాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ఉక్కు పరిశ్రమలకు కీలక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో...
- Advertisement -
Chat on WhatsApp