పెద్దపల్లిపై సీఎం రేవంత్ వరాల జల్లు
పెద్దపల్లి జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. పెద్దపల్లిలో రూరల్ పోలీసు స్టేషన్, మహిళా పోలీసు స్టేషన్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టేషన్లతో ప్రజల భద్రతా వ్యవస్థ మరింత బలపడనుంది. ఎలిగేడు మండల కేంద్రంలో కొత్త పోలీస్ స్టేషన్, వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు, పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి సామర్థ్యాన్ని 100 పడకలకు పెంచేందుకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, మంథనిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు….
