Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaPeddapalliరామగుండం ఎమ్మెల్యే ను కలిసిన విద్యాశాఖ ప్రతినిధులు

రామగుండం ఎమ్మెల్యే ను కలిసిన విద్యాశాఖ ప్రతినిధులు

-

Chat on WhatsApp

రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం ఎంఈఓ శ్రీ గడ్డం చంద్రయ్య, ముత్తారం ఎమ్ఈఓ ఇరుగురాల ఓదెలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గోదావరిఖని ప్రధానోపాధ్యాయులు జింక మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సమావేశంలో పాఠశాల సమస్యలు, అలాగే రామగుండం మండల విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాలను పరిశీలించారు. విద్యాభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు మరియు విద్యా సమాజం అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ విద్యాభివృద్ధిపై మరింత కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపించేందుకు ప్రభుత్వంతో సమన్వయం అవసరమని ఆయన తెలిపారు.

అంతేకాక, పాఠశాలల్లో మరింత వసతుల కల్పన, బోధన పద్ధతుల్లో మార్పులు, అలాగే పాఠశాల స్థిరత్వానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp