రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని రంగులు చల్లుకున్నారు. ముందుగా కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు అధికారులు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కమిషనర్ సైతం సిబ్బందికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలో బ్యాండ్ వాయిద్యాలతో అధికారులు, సిబ్బంది కలిసి నృత్యాలు చేసి సందడి చేశారు. చిన్న పిల్లలకు మిఠాయిలను పంపిణీ చేసి వారిని ఆనందింపజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, హోలీ అందరి జీవితాల్లో సంతోషాలను నింపాలని, కుటుంబాల్లో శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. హోలీ పండుగ స్నేహానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిపి ఎ.బాస్కర్, అడిషనల్ డిసిపి సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్, ట్రాఫిక్ ఎసిపి నర్సింహులు, టాస్క్ ఫోర్స్ ఎసిపి మల్ల రెడ్డి, ఇతర అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.