గుంటుపల్లి ఇసుక రేవులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
గుంటుపల్లి ఇసుక రేవు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలన చేపట్టారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ప్రాధమిక దర్యాప్తులో మృతుడు 15 రోజుల క్రితం మరణించి ఉండవచ్చని ఫోరెన్సిక్ బృందం భావిస్తోంది. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలన చేయడం కొనసాగిస్తున్నారు. మృతదేహం గుర్తింపు కోసం…
