అమలాపురం నగరంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ప్రేక్షకులను మంత్రిముగ్ధుల్ని చేస్తోంది. సినిమా హాల్ వద్ద అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా సినిమా చూసారు. ఈ సందర్బంగా ప్రదీప్ మాచిరాజు అభిమానుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అమలాపురం వాస్తవ్యుడిగా స్వస్థలంలో తన సినిమా విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రదీప్ మాచిరాజు తెలిపారు. “ఇది నాకు గర్వకారణం. మిమ్మల్ని చూసి మరింత ఉత్సాహం వస్తోంది. మీరు చూసి ఆనందించండి, మరిన్ని మంచి సినిమాలు తేవడానికి మీ ఆశీస్సులు కావాలి” అంటూ అభిమానులను ఉద్దేశించి చెప్పారు.
చిత్రంలో నటించిన హీరోయిన్, దర్శకులు, మరియు యూనిట్ సభ్యులు కూడా కార్యక్రమానికి హాజరై సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులతో కలిసి చిత్ర బృందం సెల్ఫీలు దిగుతూ ముచ్చట్లు పెట్టారు. చిత్ర ప్రదర్శన అనంతరం హాల్ వద్ద అభిమానులతో సందడి చేశారు.
ఈ సందడితో అమలాపురం వీధులు ఒక పండుగ వాతావరణాన్ని తలపించాయి. సినిమా విజయాన్ని అభిమానులు వేడుకలతో జరుపుకున్నారు. స్థానికంగా రూపొందిన ఈ సినిమా పై అభిమానుల్లో గర్వభావం కనిపించింది. స్థానిక ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్పందించడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.