Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshDevendra Fadnavis | పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఫడణవీస్ ఆరా.. త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు

Devendra Fadnavis | పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఫడణవీస్ ఆరా.. త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు

-

Chat on WhatsApp

Devendra Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో భుజ శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించి, వైద్య చికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కుడి భుజానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కలిసిన ఫడణవీస్, వైద్య చికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని దేవేంద్ర ఫడణవీస్ ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఫడణవీస్ పరామర్శ ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ntr office issues clarification on raw ntr and political entry rumours

‘RAW NTR’ ఎవరి సంస్థ? ఎన్టీఆర్ టీమ్ ఇచ్చిన స్పష్టమైన సమాధానం

ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న ప్రచారాలకు ఆయన కార్యాలయం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘RAW NTR’ అనే సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు విడుదల...
- Advertisement -
Chat on WhatsApp