Saturday, August 1, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTOTTలోకి అఖిల్ ‘లెనిన్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

OTTలోకి అఖిల్ ‘లెనిన్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

-

Chat on WhatsApp

Akhil Akkineni: థియేటర్లలో సంచలన విజయం సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అక్కినేని అఖిల్ ‘లెనిన్'(Lenin) ఇప్పుడు ఓటీటీ(OTT) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ యాక్షన్-ఎమోషనల్ ఎంటర్‌టైనర్ డిజిటల్ రిలీజ్ డేట్‌ను ZEE5 అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది? తెలుసుకుందాం. గ్రామీణ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పగా, థియేటర్లలో వాటిని అందుకుని బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథలో యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అఖిల్ నటన, మాస్ అప్పీల్‌కు ప్రశంసలు లభించాయి. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ‘లెనిన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ZEE5 దక్కించుకుంది. ఆగస్టు 7 నుంచి ఈ చిత్రం ZEE5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇంటి నుంచే సినిమాను ఆస్వాదించవచ్చు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi

PM Modi | ఉత్తరాంధ్ర ప్రగతికి శ్రీకారం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై మోడీ కీలక వ్యాఖ్యలు  

PM Modi: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఇది కీలకమైన రోజని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం...
- Advertisement -
Chat on WhatsApp