Saturday, August 1, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadFIEO | అంతర్జాతీయ మార్కెట్‌లో అడుగు పెట్టాలనుకునే వారికీ గోల్డెన్ ఛాన్స్.. ఫియో సర్టిఫికెట్ ప్రోగ్రామ్

FIEO | అంతర్జాతీయ మార్కెట్‌లో అడుగు పెట్టాలనుకునే వారికీ గోల్డెన్ ఛాన్స్.. ఫియో సర్టిఫికెట్ ప్రోగ్రామ్

-

Chat on WhatsApp

FIEO: అంతర్జాతీయ మార్కెట్‌ ఎగుమతి రంగంలో వ్యాపారాన్ని రాణించాలని భావిస్తున్న పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, యువ వ్యాపారులకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) శుభవార్త చెప్పింది. “Export Opportunities – How to Start Export Business” అనే అంశంపై రెండు రోజుల సర్టిఫికెట్ శిక్షణా కార్యక్రమాన్ని ఆగస్టు 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనుంది. ఎగుమతి రంగంలో రాణించాలని భావిస్తున్న వారితో పాటు ఇప్పటికే వ్యాపారం చేస్తున్నవారికి కూడా ఉపయోగపడేలా ఈ కోర్సును రూపొందించారు. ఇందులో ఎగుమతి విధానాలు, డాక్యుమెంటేషన్, ప్రభుత్వ నిబంధనలు, ట్రేడ్ ఫైనాన్స్, జీఎస్టీ, ఎగుమతి ప్రోత్సాహకాలు, విదేశీ మార్కెట్ల ఎంపిక, కొనుగోలుదారులను గుర్తించే విధానం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు), క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి కీలక అంశాలపై నిపుణులు సమగ్రంగా శిక్షణ అందిస్తారు.

ఫియో జాయింట్ డైరెక్టర్ జనరల్ ఉన్నికృష్ణన్ కె. మాట్లాడుతూ, అంతర్జాతీయ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే సంస్థలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఎగుమతి డాక్యుమెంటేషన్, మార్కెట్ వ్యూహాలపై స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు బ్యాంకులు, ECGC అధికారులతో నేరుగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి FIEO సర్టిఫికెట్ అందజేయనున్నారు. మరిన్ని వివరాల కోసం తెలంగాణ చాప్టర్ హెడ్ ఆర్. కులకర్ణిను kulkarni@fieo.org ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

1965లో భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడిన FIEO, దేశంలోని ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, కమోడిటీ బోర్డులు, డెవలప్‌మెంట్ అథారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యున్నత సంస్థగా గుర్తింపు పొందింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Akhil Akkineni's blockbuster Lenin

OTTలోకి అఖిల్ ‘లెనిన్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Akhil Akkineni: థియేటర్లలో సంచలన విజయం సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అక్కినేని అఖిల్ 'లెనిన్'(Lenin) ఇప్పుడు ఓటీటీ(OTT) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ యాక్షన్-ఎమోషనల్...
- Advertisement -
Chat on WhatsApp