Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeNationalNEET Students Dance | ఇది నిరసననా.. లేక రైన్ డాన్స్ ఆ.. నిరసన కాస్తా...

NEET Students Dance | ఇది నిరసననా.. లేక రైన్ డాన్స్ ఆ.. నిరసన కాస్తా సెలబ్రేషన్‌గా మారిందా ?

-

Chat on WhatsApp

NEET Students Dance: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బిహార్ రాజధాని పాట్నాలో కూడా విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఆందోళన సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు, భాష్పవాయువు ప్రయోగించారు. అయితే ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న కొందరు విద్యార్థులు వాటర్ కెనాన్ నీటిని చూసి అక్కడి నుంచి వెళ్లిపోకుండా దానిని ఆస్వాదించడం ప్రారంభించారు.

నీటి ధారలు తమపై పడుతుండగా కొందరు విద్యార్థులు సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. పోలీసుల చర్యతో ఆందోళన ప్రదేశం కాసేపు వినోద వాతావరణంగా మారింది. డీజే పాటల మధ్య విద్యార్థులు వర్షంలో తడుస్తున్నట్టుగా ఉత్సాహంగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు దీనిపై ఇది నిరసననా.. లేక రైన్ డాన్స్ ఆ అని ఆగ్రహం వ్యక్తం చేయగా, మరి కొందరు  మీమ్స్, ఫన్నీ పోస్టులు షేర్ చేస్తున్నారు. నిరసన తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

WhatsApp new features including PDF editing and iPad support

WhatsApp | స్టేటస్‌లో పాటలు.. PDF ఎడిటింగ్.. కొత్త ఫీచర్లతో వాట్సాప్‌ యూజర్లకు సర్‌ప్రైజ్!

WhatsApp: వాట్సాప్‌ వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు మెటా పలు కొత్త ఫీచర్లను విడుదల చేసింది. వీటిలో యాప్‌లోనే PDF ఫైళ్లను ఎడిట్‌ చేసే సదుపాయం, ఐప్యాడ్‌ను ప్రైమరీ డివైజ్‌గా ఉపయోగించే అవకాశం,...
- Advertisement -
Chat on WhatsApp