Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeSportsBCCI | రోహిత్ రిటైర్మెంట్ వార్తలకు బీసీసీఐ చెక్.. లార్డ్స్ మ్యాచ్‌పై క్లారిటీ

BCCI | రోహిత్ రిటైర్మెంట్ వార్తలకు బీసీసీఐ చెక్.. లార్డ్స్ మ్యాచ్‌పై క్లారిటీ

-

Chat on WhatsApp

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ(BCCI) తెరదించింది. ఆదివారం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. రోహిత్ భవిష్యత్తుపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నప్పటికీ, అతని రిటైర్మెంట్ గురించి బోర్డు ఎలాంటి చర్చ జరపలేదని తెలిపారు. భారత వన్డే జట్టులో రోహిత్ కీలక సభ్యుడేనని, దేశానికి మరింత కాలం ప్రాతినిధ్యం వహిస్తాడని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవలి మ్యాచ్‌ల్లో రోహిత్ ఆటతీరు చర్చనీయాంశంగా మారింది.

చాంపియన్స్ ట్రోఫీ తర్వాత 14 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 589 పరుగులు చేసినా, గతంలో కనిపించిన దూకుడు మాత్రం తగ్గిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2023 ప్రపంచకప్‌లో ధాటిగా ఆడిన హిట్‌మ్యాన్ ప్రస్తుతం భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనతో జట్టులో స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుస శతకాలతో తన సత్తా చాటగా, రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులో నిలిచాడు. ఈ పరిస్థితుల్లో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డేలో రోహిత్ ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Godavari River

Godavari River | గోదావరిలో ఘోర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనుల దుర్మరణం

Godavari River: పోలవరం జిల్లాలోని ఎటపాక మండలంలో విషాదం చోటుచేసుకుంది. గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు,...
- Advertisement -
Chat on WhatsApp