Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshGodavari River | గోదావరిలో ఘోర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనుల దుర్మరణం

Godavari River | గోదావరిలో ఘోర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనుల దుర్మరణం

-

Chat on WhatsApp

Godavari River: పోలవరం జిల్లాలోని ఎటపాక మండలంలో విషాదం చోటుచేసుకుంది. గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానిక మత్స్యకారులు, ఈతగాళ్ల సహాయంతో గోదావరిలో విస్తృతంగా గాలింపు చేపట్టగా, కొంతసేపటి తర్వాత ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, నిత్యం మాదిరిగానే చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన వీరు ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లారు. నీటి లోతును అంచనా వేయలేకపోవడంతో వేగంగా ప్రవహిస్తున్న ప్రవాహంలో చిక్కుకుని బయటపడలేకపోయినట్లు తెలుస్తోంది. మృతులంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన వారేనని పోలీసులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Naga Chaitanya and Sobhita Dhulipala inaugurating RS Brothers showroom in Boduppal

RS Brothers | బోడుప్పల్‌లో మెరిసిన స్టార్ జంట.. RS బ్రదర్స్ షోరూమ్‌కు గ్రాండ్...

RS Brothers: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లో ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ RS బ్రదర్స్ కొత్త షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. సినీ నటుడు నాగచైతన్య(Naga Chaitanya), నటి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) ముఖ్య అతిథులుగా...
- Advertisement -
Chat on WhatsApp