Skyroot Aerospace: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన స్వదేశీ విక్రమ్-1 రాకెట్(Vikram-1 rocket) విజయవంతంగా ప్రయోగమైంది. మొదట ఉదయం 11.35 గంటలకు రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమైనా, ఇంధన వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా లాంచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు.
శాస్త్రవేత్తలు లోపాలను సరిచేసిన తర్వాత మధ్యాహ్నం 12.05 గంటలకు రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్-1 నాలుగు దశల ఆర్బిటల్ లాంచ్ వెహికల్. ఇందులో తొలి మూడు దశలు సాలిడ్ ప్రొపల్షన్‌పై పనిచేస్తే, చివరి దశలో లిక్విడ్ ఇంజిన్‌ను వినియోగించారు. 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమి కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యం ఈ రాకెట్‌కు ఉంది.
తొలి టెస్ట్ ఫ్లైట్‌లో 450 కిలోమీటర్ల ఎత్తులో 60 డిగ్రీల వాలుతో కక్ష్యను చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మిషన్ ద్వారా భారతీయ ఎర్త్ అబ్జర్వేషన్ నానోశాటిలైట్ సంస్థ ‘గ్రహ స్పేస్’తో పాటు పలువురు భాగస్వాముల సాంకేతిక పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఈ విజయంతో భారత ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ మరో ముందడుగు వేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








