Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAP Cabinet | చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. రైతులు, అమరావతి, సోషల్ మీడియాపై బిగ్ డెసిషన్స్!

AP Cabinet | చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. రైతులు, అమరావతి, సోషల్ మీడియాపై బిగ్ డెసిషన్స్!

-

Chat on WhatsApp

AP Cabinet: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అభివృద్ధి, మౌలిక వసతులు, వ్యవసాయం, విద్య, పర్యాటకం, పరిపాలన వంటి కీలక రంగాలకు సంబంధించిన పలు నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 30కిపైగా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పలు అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రూ.9,355 కోట్ల వ్యయంతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రూ.1,811 కోట్లతో వేలాది తాగునీటి పథకాలను చేపట్టేందుకు అనుమతి మంజూరైంది. అలాగే పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునికీకరణ, కుప్పం ఫీడర్ ఛానెళ్లు, బీరగానిపల్లె రిజర్వాయర్ పనులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు పలు ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నిర్దిష్ట తేదీకి ముందు తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీ వర్తించేలా నిర్ణయం తీసుకోగా, భూములు ఇచ్చిన రైతులకు చెల్లించే వార్షిక కౌలును కూడా పెంచాలని ఆమోదించారు. అదేవిధంగా ఇనాం భూముల పరిహారం చెల్లింపులు, పలు జాతీయ స్థాయి సంస్థలకు భూకేటాయింపులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కొత్త ప్రాజెక్టులు, హోటళ్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, కడపలో అమ్యూజ్‌మెంట్ పార్కు, తిరుపతి జిల్లాలో లాజిస్టిక్స్ పార్కు, విశాఖలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు, అంబేద్కర్ గురుకుల సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణ కేంద్రాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

సమావేశం అనంతరం సోషల్ మీడియాలో ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అసత్య ప్రచారం, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అవసరమైతే అదనపు నిపుణులను నియమించుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రతిపక్షాల రాజకీయ విమర్శలకు భావోద్వేగంగా స్పందించకుండా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం సూచించారు. జిల్లాల వారీగా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp