Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeInterNationalనేరాలు లేవు.. సైన్యం లేదు.. అయినా ప్రపంచంలోనే సురక్షిత దేశం ఇదే!

నేరాలు లేవు.. సైన్యం లేదు.. అయినా ప్రపంచంలోనే సురక్షిత దేశం ఇదే!

-

Chat on WhatsApp

ప్రపంచవ్యాప్తంగా భద్రత, జీవన ప్రమాణాలు, సామాజిక ప్రశాంతత వంటి అంశాలను పరిశీలించి ప్రతి ఏడాది దేశాలకు ర్యాంకులు ప్రకటిస్తుంటారు. ఈ జాబితాలో గత 19 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు లేకుండా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న దేశం ” world’s most peaceful country” ఐస్‌లాండ్(Iceland). చిన్న దేశమైనప్పటికీ భద్రత, ప్రజల జీవనశైలి, పరస్పర విశ్వాసం వంటి అంశాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఐస్‌లాండ్‌లో నేరాల శాతం అత్యంత తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడి పోలీసులు రోజువారీ విధుల్లో సాధారణంగా తుపాకులు ధరించరు. ప్రజల్లో చట్టాలపై గౌరవంతో పాటు ఒకరిపై మరొకరికి నమ్మకం ఎక్కువగా ఉండటం వల్ల శాంతిభద్రతల సమస్యలు అరుదుగా కనిపిస్తాయి. శాశ్వత సైన్యం కూడా ఈ దేశానికి లేదు. అవసరమైన రక్షణ బాధ్యతలను కోస్ట్‌గార్డ్‌తో పాటు ప్రత్యేక భద్రతా విభాగాలు నిర్వహిస్తాయి.

ప్రకృతి సంపద కూడా ఐస్‌లాండ్‌కు మరో ప్రధాన బలం. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి లభించే దేశాల్లో ఇది ఒకటి. హిమనదుల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిని నేరుగా తాగేందుకు అనువుగా ఉండటం విశేషం. కాలుష్యం తక్కువగా ఉండటంతో ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆస్వాదిస్తున్నారు. ఈ దేశంలో కుటుంబ వ్యవస్థకు, సమానత్వానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. మహిళలు, పిల్లలు, వివిధ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. చిన్నారులను బేబీ స్ట్రోలర్‌లలో బయట నిద్రపుచ్చేంత భద్రత ఉండటం అక్కడి సామాజిక వాతావరణానికి నిదర్శనంగా చెబుతారు.

‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్’ విడుదల చేసే గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో భద్రత, అంతర్గత శాంతి, ఘర్షణల స్థాయి, సైనికీకరణ వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు నిర్ణయిస్తారు. ఈ సూచీలో ఐస్‌లాండ్ వరుసగా 19 ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రశాంత దేశంగా తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

donald trump comments on india pakistan conflict and operation sindoor

Donald Trump | నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి.. ఎందుకంటే, భారత్-పాక్ యుద్ధాన్ని...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చకుండా తాను జోక్యం...
- Advertisement -
Chat on WhatsApp