Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTThe Tatas Web Series | వ్యాపార దిగ్గజం టాటా కుటుంబ చరిత్రతో కొత్త వెబ్...

The Tatas Web Series | వ్యాపార దిగ్గజం టాటా కుటుంబ చరిత్రతో కొత్త వెబ్ సిరీస్.. ఓటీటీలోకి ఎప్పుడంటే ?

-

Chat on WhatsApp

The Tatas Web Series: భారత పారిశ్రామిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన టాటా కుటుంబం జీవిత ప్రయాణం త్వరలో వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులను అలరించనుంది. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఈ వ్యాపార కుటుంబం కథను ఆధారంగా చేసుకుని ‘The Tatas’ పేరుతో ఓ ప్రీమియం మల్టీ సీజన్ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఈ ప్రాజెక్ట్ ప్రకటనతోనే వ్యాపార రంగం, సినీ ప్రేక్షకులు, చరిత్రపై ఆసక్తి ఉన్న వారిలో ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్‌కు ప్రముఖ రచయిత గిరీష్ కుబేర్ రచించిన ‘The Tatas: How a Family Built a Business and a Nation’ పుస్తకం ప్రేరణగా నిలవనుంది. టాటా కుటుంబం వ్యాపార విజయాలకే పరిమితం కాకుండా, దేశ పారిశ్రామిక అభివృద్ధి, సామాజిక బాధ్యత, దాతృత్వం, విద్య, విజ్ఞాన రంగాల్లో చేసిన సేవలను కూడా ఇందులో ప్రతిబింబించనున్నారు. వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాతో ప్రారంభమయ్యే ఈ కథ, దొరబ్జీ టాటా, జె.ఆర్.డి. టాటా, రతన్ టాటా వరకు నాలుగు తరాల నాయకత్వాన్ని చూపించనుంది.

దేశ నిర్మాణంలో వారి దూరదృష్టి, పారిశ్రామిక విప్లవానికి అందించిన సహకారం, విలువలతో కూడిన వ్యాపార విధానాన్ని కథలో ప్రధానంగా చూపించనున్నట్లు సమాచారం. ఇటీవల మంచి ఆదరణ పొందిన ‘Made in India: A Titan Story’ వెనుక ఉన్న టీ సిరీస్ ఫిల్మ్స్, ఆల్మైటీ మోషన్ పిక్చర్ సంస్థలే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. కథను రచయిత కరణ్ వ్యాస్ రూపొందిస్తున్నారు.

టాటా కుటుంబం ప్రయాణం కేవలం ఒక వ్యాపార సంస్థ ఎదుగుదల మాత్రమే కాదని, దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అంకితమైన విలువల కథ అని నిర్మాతలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రకటన మాత్రమే విడుదల కాగా, దర్శకుడు ఎవరు? ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారు? అనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ టాటా వారసత్వాన్ని తెరపై ఎలా చూపిస్తారనే ఆసక్తి ఇప్పటికే ప్రేక్షకుల్లో నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp