Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshWest Godavari | చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. మరణించిన కుక్క

West Godavari | చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. మరణించిన కుక్క

-

Chat on WhatsApp

West Godavari: జాహ్నవి మిస్సింగ్ కేసులో పశ్చిమ గోదావరిలో మరో షాకింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఐదు రోజులుగా చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేసులో ప్రధాన ఆధారంగా భావించిన పెంపుడు కుక్క అనుమానాస్పద రీతిలో మృ**తి చెందడం కొత్త అనుమానాలకు దారితీసింది.

పాపతో కలిసి వెళ్లినట్లు భావించిన ఆ పెంపుడు కుక్క ముందుగా తిరిగి రావడంతో దానినే ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. కుక్క మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవిలోకి వదిలి, దాని కదలికల ఆధారంగా చిన్నారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే మనుషులను చూసి భయపడుతున్న కారణంగా దాన్ని బోనులో ఉంచి పరిశీలించారు. ఇంతలోనే ఆ కుక్క అనుమానాస్పద పరిస్థితుల్లో మృ**తి చెందడం కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. గత రెండు రోజులుగా అది అసాధారణంగా ప్రవర్తించిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇది సహజ మరణమా లేక ఎవరి కారణంగానైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసులో ఇప్పటికే భావోద్వేగ దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. చిన్నారి తల్లి కుక్కతో మాట్లాడుతూ తన బిడ్డను తీసుకురావాలని వేడుకున్న వీడియో నెటిజన్లను కదిలించింది. అయితే ఇప్పుడు కీలక ఆధారంగా ఉన్న కుక్కనే కోల్పోవడంతో చిన్నారి ఆచూకీ కనుగొనడం పోలీసులకు మరింత పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం పోలీసులు పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కుక్క సహజంగా అడవిలో ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల అలసిపోయి చనిపోయిందా? లేదా ఎవరో దాన్ని హానిచేశారా? అనే అనుమానాలను పరిశీలిస్తున్నారు. చిన్నారి జాహ్నవి కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp