Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTChiranjeevi | భారతీయ సినిమా ఒక గొప్ప కథకుడిని కోల్పోయింది… మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi | భారతీయ సినిమా ఒక గొప్ప కథకుడిని కోల్పోయింది… మెగాస్టార్ చిరంజీవి

-

Chat on WhatsApp

Chiranjeevi: సినీ ప్రపంచంలో ఒక గొప్ప అధ్యాయం ఇక ముగిసింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన ప్రత్యేక కథన శైలితో, పల్లెటూరి జీవనాన్ని అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీరాజా (84) ఇక లేరు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, బుధవారం ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

భారతీరాజా మరణవార్తతో కోలీవుడ్, టాలీవుడ్ సినీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన దర్శకత్వ ప్రతిభకు అభిమానులుగా ఉన్న సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలివస్తున్నారు.

సామాన్యుల జీవితాల్లోని భావోద్వేగాలను, గ్రామీణ నేపథ్యంలోని సహజతను, మానవ సంబంధాల సున్నితత్వాన్ని అద్భుతంగా చిత్రీకరించిన దర్శకుడిగా భారతీరాజా గుర్తింపు పొందారు. ఆయన సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాకుండా, కొత్త తరానికి మార్గదర్శకంగా నిలిచాయి. ఈ విషాద సమయంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినిమా ఒక గొప్ప కథకుడిని కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. భారతీరాజా సృష్టించిన పాత్రలు, కథలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.

1987లో వచ్చిన ‘ఆరాధన’ చిత్రంలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలోని ‘పులిరాజు’ పాత్ర తన కెరీర్‌లో ప్రత్యేకమైనదని, ఆ అవకాశాన్ని ఇచ్చిన భారతీరాజాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. షూటింగ్ సమయంలో ఆయన చూపిన ప్యాషన్, అంకితభావం, సరళత తనపై గాఢమైన ప్రభావం చూపించాయని చెప్పారు. భారతీరాజా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన సినిమాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp