Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeNationalTamil Nadu | తమిళనాడులో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం.. జూన్‌లో షెడ్యూల్ ?

Tamil Nadu | తమిళనాడులో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం.. జూన్‌లో షెడ్యూల్ ?

-

Chat on WhatsApp

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో ఉప ఎన్నికల హడావుడి రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీ) వేగంగా ఏర్పాట్లు ప్రారంభించింది. ముఖ్యమంత్రి సహా పలువురు ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పులు కారణంగా ఈ స్థానాలు ఖాళీ కావడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

తాజా పరిణామాల ప్రకారం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి విజయం సాధించిన విజయ్, ఎన్నికల నిబంధనల ప్రకారం తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో ఆ నియోజకవర్గం అధికారికంగా ఖాళీగా మారింది. మరోవైపు, అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి జరిగిన విశ్వాస పరీక్షలో టీవీకేకు మద్దతు తెలిపిన అనంతరం పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారు.

పెరందురైకి చెందిన ఎస్. జయకుమార్, మధురాంతకానికి చెందిన మరగతం కుమరవేల్, ధారపురానికి చెందిన పి. సత్యభామ, అంబసముద్రానికి చెందిన ఇసక్కీ సుబ్బయ్య తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అధికార పార్టీ వైపు చేరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో సన్నాహాలను వేగవంతం చేసింది. జూన్ 22లోపు అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే ఐదు నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించి ఎన్నికల ప్రక్రియకు పునాది వేసింది. పరిపాలనా, లాజిస్టిక్స్ అంశాలపై సమీక్ష పూర్తైన తరువాత రానున్న వారాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp