Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTOTT platforms | పెద్ది సినిమా నుంచి ఓటీటీ వరకూ.. జూన్‌లో భారీ రిలీజ్‌ల హవా

OTT platforms | పెద్ది సినిమా నుంచి ఓటీటీ వరకూ.. జూన్‌లో భారీ రిలీజ్‌ల హవా

-

Chat on WhatsApp

OTT platforms: దాదాపు గత 5 నెలల నుంచి అంటే సంక్రాంతి తర్వాత టాలీవుడ్ పరిశ్రమలో భారీ సినిమాల విడుదల తగ్గిపోవడంతో ఏర్పడిన ఖాళీని పూడ్చేందుకు రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” (Peddi Movie) సిద్ధమవుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

ఇదే సమయంలో థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా భారీ సినిమాల రిలీజ్‌లు వరుసగా జరుగుతున్నాయి. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన “ధురంధర్: ది రివెంజ్” జూన్ 5 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతకంటే ముందుగా జూన్ 4న రాత్రి 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ జరగనుంది. ఈ చిత్రం తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులో ఉండనుంది.

భారత్ వెలుపల ప్రేక్షకులకు మాత్రం నెట్‌ఫ్లిక్స్ ద్వారా వీక్షణ అవకాశం కల్పించనున్నారు. మరోవైపు మలయాళ స్టార్ కాంబినేషన్ మమ్ముట్టి, మోహన్‌లాల్ నటించిన “పేట్రియాట్” జీ5లో జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, ఫహాద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

అదే రోజున కన్నడ యాక్షన్ మూవీ “కేడీ: ది డెవిల్” కూడా జీ5లో విడుదల కానుంది. ధ్రువ్ సర్జా హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ఇక ఓటీటీ వేదికలపై అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ ద్వారా కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు జూన్ మొదటి వారంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. దీంతో ఒకవైపు “పెద్ది” థియేటర్లలో హవా కొనసాగిస్తుండగా, మరోవైపు ఓటీటీలో భారీ ఎంటర్టైన్మెంట్ వరద కనిపిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp