Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeSportsKavya Maran | కావ్యా మారన్ ఏడ్చారన్న వైరల్ వీడియోపై ఫ్యాక్ట్ చెక్.. అసలు నిజం...

Kavya Maran | కావ్యా మారన్ ఏడ్చారన్న వైరల్ వీడియోపై ఫ్యాక్ట్ చెక్.. అసలు నిజం ఇదే

-

Chat on WhatsApp

IPL 2026: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి తర్వాత జట్టు యజమాని కావ్యా మారన్(Kavya Maran) కన్నీళ్లు పెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.

అయితే తాజాగా జరిగిన ఫ్యాక్ట్ చెక్‌లో ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం అని తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ప్రస్తుత ఎలిమినేటర్ మ్యాచ్‌కు సంబంధించినవి కాదని పలు నివేదికలు వెల్లడించాయి. అసలు దృశ్యాలను ఎడిట్ చేసి, కావ్యా మారన్ ఏడుస్తున్నట్లుగా చూపిస్తూ వైరల్ చేసినట్లు గుర్తించారు. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి అనుసంధానం చేస్తూ షేర్ చేశారు.

అయితే ఆ వీడియో వాస్తవానికి పాత ఐపీఎల్ మ్యాచ్ సందర్భానికి చెందినదని ఫ్యాక్ట్ చెకర్స్ స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ అనంతరం కావ్యా మారన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని అభినందించిన దృశ్యాలు మాత్రం నిజమైనవిగా బయటపడ్డాయి.

ఆమె క్రీడాస్ఫూర్తితో ప్రత్యర్థి జట్టు ఆటగాడిని అభినందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల ఐపీఎల్‌కు సంబంధించిన పలు ఫేక్ ఫొటోలు, ఎడిట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కావ్యా మారన్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు AI ద్వారా రూపొందించబడినవిగా కూడా గతంలో ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వెల్లడించాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp