బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్(Michael Jackson) క్లాసిక్ సాంగ్ ‘Don’t Stop ’Til You Get Enough’కు ఆమె తన ఇంట్లో నైట్ డ్రెస్‌లో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
ఈ వీడియోను ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న సినీ రచయిత రాహుల్ మోడీ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న శ్రద్ధా, “మిమ్మల్ని ఇలా డ్యాన్స్ చేయించే వ్యక్తిని వెతుక్కోండి” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జతచేశారు.
దీంతో వీరిద్దరి రిలేషన్‌పై కొనసాగుతున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. ఇక సినిమాల విషయానికొస్తే, 2024లో వచ్చిన ‘స్త్రీ 2’తో శ్రద్ధా భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.








