Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAP KGBV teacher recruitment | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో టీచర్ ఉద్యోగాలు

AP KGBV teacher recruitment | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో టీచర్ ఉద్యోగాలు

-

Chat on WhatsApp

AP KGBV teacher recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి, పాఠశాల విద్యా శాఖ 2026 సంవత్సరానికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
  
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 299 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ అవకాశానికి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 352 KGBV హాస్టల్ స్కూళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భారీ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పోస్టుల ఎంపిక రాత పరీక్ష లేకుండా, అకడమిక్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

ఖాళీల వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి ప్రిన్సిపల్ పోస్టులు 16, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs) 98, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (CRTs) 133, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PETs) 52. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యాభివృద్ధి లక్ష్యంగా KGBVలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థల్లో సేవ చేయడం ద్వారా మహిళా ఉపాధ్యాయులు విద్యా రంగంలో కీలక పాత్ర పోషించవచ్చు.

అర్హతల ప్రకారం సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్, B.Ed లేదా సమానమైన అర్హతలు అవసరం. వయోపరిమితి మరియు ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.

ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు విద్యా రంగంలో మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp