Lenin Movie Review: అక్కినేని అఖిల్(Akhil Akkineni) నటించిన ‘లెనిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అమెరికాలో ప్రదర్శించిన ప్రీమియర్ షోల అనంతరం సోషల్ మీడియాలో తొలి స్పందనలు వైరల్ అవుతున్నాయి. అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా కీలకమని భావిస్తున్న అభిమానులు పాజిటివ్ టాక్‌పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రారంభంలో వినిపించే జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) వాయిస్ ఓవర్ ప్రేక్షకులను ఆకట్టుకుందని పోస్టులు వస్తున్నాయి.
అఖిల్ ఈ చిత్రంలో గత సినిమాలకు భిన్నంగా మాస్ పాత్రలో కనిపించాడని, నటనలో కొత్త కోణాన్ని చూపించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో అఖిల్ కెమిస్ట్రీ బాగుందని, ఫస్ట్ హాఫ్‌లో ప్రేమకథ, ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకున్నాయని అంటున్నారు. రెండో భాగంలో ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ సినిమాకు బలంగా నిలిచాయని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
థమన్ నేపథ్య సంగీతం, శివాజీ నటనకు కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వస్తున్నవి అమెరికా ప్రీమియర్ షోలు చూసిన కొందరు ప్రేక్షకుల అభిప్రాయాలు మాత్రమే. సినిమా అసలు ఫలితం అన్ని ప్రాంతాల ప్రేక్షకుల స్పందన, బాక్సాఫీస్ కలెక్షన్ల తర్వాతే స్పష్టమవుతుంది.
ALSO READ: Telangana | నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్.. ఎందుకంటే?








