Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaTelangana POLYCET 2026 Results | తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో బాలికల హవా

Telangana POLYCET 2026 Results | తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో బాలికల హవా

-

Chat on WhatsApp

Telangana POLYCET 2026 Results: తెలంగాణ పాలిసెట్-2026 విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ పాలిసెట్ ఫలితాలను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈసారి అధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 82.94గా నమోదైంది. ఫలితాల్లో బాలికలు మరోసారి బాలుర కంటే మెరుగైన ప్రతిభ కనబరిచారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మొత్తం 1,06,439 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 98,029 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 79.9గా ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం 86.38గా నమోదు కావడం విశేషం.

స్ట్రీమ్‌ల వారీగా పరిశీలిస్తే MPC విభాగంలో 81,307 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, MBiPC స్ట్రీమ్‌లో 79,652 మంది అర్హత పొందారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఫలితాల విడుదల అనంతరం త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాల్ లెటర్ ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు పీజేటీఏయూ (Professor Jayashankar Telangana State Agricultural University), ఎస్‌కేఎల్‌టిహెచ్‌యూ (Sri Konda Laxman Telangana Horticultural University), పీవీఎన్‌ఆర్‌టీవీయూ (P.V. Narasimha Rao Telangana Veterinary University) వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అర్హత పొందనున్నారు.

వ్యవసాయం, ఫుడ్ టెక్నాలజీ, సీడ్ సైన్స్, వెటర్నరీ సంబంధిత కోర్సుల్లో చేరేందుకు ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Actor Rajpal Yadav | చెక్ బౌన్స్ వ్యవహారంలో రాజ్‌పాల్ యాదవ్‌కు భారీ ఎదురుదెబ్బ

Actor Rajpal Yadav: బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్‌కు సంబంధించిన పలు కేసుల్లో దిగువ కోర్టులు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp