Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeSportsIPL 2026 | శుభ్‌మన్ గిల్ క్యాచ్... టోర్నీ నుంచి సీఎస్కే ఔట్

IPL 2026 | శుభ్‌మన్ గిల్ క్యాచ్… టోర్నీ నుంచి సీఎస్కే ఔట్

-

Chat on WhatsApp

IPL 2026: ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి మ్యాచ్‌లో చెన్నై ఆశలపై నీళ్ళు చల్లిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిసిన గిల్, వన్ మ్యాన్ షోతో మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ టైటాన్స్ `వైపు తిప్పేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ 89 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించగా, గుజరాత్ ప్లేఆఫ్స్‌లో టాప్-2 అవకాశాలను బలపరుచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 229 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ గిల్ 64 పరుగులతో మంచి ఆరంభం అందించాడు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో జోస్ బట్లర్ 27 బంతుల్లో 57 పరుగులతో దూకుడుగా ఆడాడు.

లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్‌ను గుజరాత్ బౌలర్లు కట్టడి చేశారు. మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, రగడ చెరో మూడు వికెట్లు తీసి చెన్నై బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. దీంతో సీఎస్కే 140 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో గిల్ ఫీల్డింగ్‌లో కూడా హీరోగా నిలిచాడు. దూకుడుగా ఆడుతున్న శివమ్ దూబేను అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. అలాగే కార్తీక్ శర్మను మెరుపు డైరెక్ట్ హిట్‌తో రనౌట్ చేశాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ రెండింట్లోనూ ప్రభావం చూపిన గిల్ ప్రదర్శన మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp