Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeBusinessBank Holidays | SBI బ్యాంక్ సేవలు ఆరు రోజులు నిలిచిపోనున్నాయా? పూర్తి వివరాలు ఇవే

Bank Holidays | SBI బ్యాంక్ సేవలు ఆరు రోజులు నిలిచిపోనున్నాయా? పూర్తి వివరాలు ఇవే

-

Chat on WhatsApp

Bank Holidays: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. మే 23, 2026 నుంచి మే 28 వరకు వరుసగా ఆరు రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో SBI బ్రాంచ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో బ్యాంక్‌కు వెళ్లి చేయాల్సిన పనులు ఉన్నవారు ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ అంతరాయానికి కారణంగా వీకెండ్ సెలవులు, ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె, అలాగే బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సెలవులు కలిసివచ్చినట్లు తెలుస్తోంది. మే 23న నాలుగో శనివారం, మే 24న ఆదివారం కావడంతో సాధారణంగానే బ్యాంకులు మూసివేయబడతాయి.

ఆ తర్వాత మే 25, 26 తేదీల్లో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) కూడా మద్దతు తెలిపింది. ఖాళీల భర్తీ, భద్రతా సిబ్బంది నియామకం, ఔట్‌సోర్సింగ్ విధానానికి వ్యతిరేకత, పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు వంటి డిమాండ్లతో ఈ ఆందోళన జరుగుతోంది.

దీని తర్వాత మే 27, 28 తేదీల్లో బక్రీద్ పండుగ సెలవులు రావడంతో దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సెలవులు వర్తించే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో అయితే వరుసగా రెండు రోజులు బ్యాంకులు మూసివేయబడనున్నాయి.

ఈ విధంగా వీకెండ్, సమ్మె, పండుగ సెలవులు కలిసిరావడంతో మొత్తం ఆరు రోజుల పాటు బ్రాంచ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. అయితే SBI ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, UPI లావాదేవీలు, ATM సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp