ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ OPPO తన కొత్త మోడల్ ఫ్లాగ్‌షిప్ OPPO Find X9sను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఆధునిక ప్రీమియం డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9500s ప్రాసెసర్ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్‌ప్లే, భారీ 7025mAh బ్యాటరీ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Android 16 ఆధారిత ColorOS 16పై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది.
ధరలు మరియు వేరియంట్లు
ఒప్పో ఫైండ్ X9s రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
12GB RAM + 256GB స్టోరేజ్ – రూ.79,999
12GB RAM + 512GB స్టోరేజ్ – రూ.89,999
మిడ్‌నైట్ గ్రే, లావెండర్ స్కై, సన్‌సెట్ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది. ఒప్పో ఫైండ్ X9sను వినియోగదారులు OPPO India అధికారిక స్టోర్‌తో పాటు Amazon India మరియు Flipkart ద్వారా కూడా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. మే 28 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. మే 14–27 మధ్య ప్రీ-బుకింగ్ చేసుకునే వారికి ఉచిత గిఫ్ట్ బాక్స్ అందించనుంది.
డిస్‌ప్లే మరియు పనితీరు
ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు.
రిజల్యూషన్: 2760 × 1256 పిక్సెల్స్
రిఫ్రెష్ రేట్: 120Hz
PWM డిమ్మింగ్: 3840Hz
గరిష్ట బ్రైట్‌నెస్: 3600 నిట్స్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో డిస్‌ప్లేను రక్షించారు. Immortalis G925 MC12 GPU గ్రాఫిక్స్ పనితీరును మెరుగుపరుస్తుంది.
కెమెరా ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు.
50MP ప్రైమరీ కెమెరా (OIS)
50MP అల్ట్రా వైడ్ కెమెరా
50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో (OIS)
సెల్ఫీలు తీసుకోవడం, వీడియో కాల్స్ చేయడం కోసం ఈ ఫోన్‌లో 32MP సామర్థ్యమున్న ఫ్రంట్ కెమెరాను అందించారు.
బ్యాటరీ మరియు ఇతర ఫీచర్లు
ఈ ఫోన్‌లో 7025mAh భారీ బ్యాటరీతో పాటు 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. వేగవంతమైన 5G కనెక్టివిటీతో పాటు Wi-Fi 7, Bluetooth 6.1, NFC వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే దుమ్ము మరియు నీటి నుంచి పూర్తి రక్షణ కోసం IP66, IP68, IP69 రేటెడ్ వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ను కూడా అందించారు.








