Airbase Controversy: పాకిస్థాన్‌కు చెందిన ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిస్పందనగా తాము ‘బునియాన్ ఉల్ మర్సూస్’ పేరుతో చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా రాజౌరీ, మామూన్ ప్రాంతాల్లోని భారత వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులు చేశామని పేర్కొన్నారు.
అయితే ఆయన చెప్పిన రెండు ప్రాంతాల్లో అసలు ఎలాంటి ఎయిర్‌బేస్‌లు లేవని స్పష్టమవడంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాజౌరీ జమ్మూకశ్మీర్‌లోని ఒక జిల్లా మాత్రమే కాగా, అక్కడ ఎయిర్‌ఫోర్స్ స్థావరం లేదని తెలుస్తోంది. అలాగే మామూన్ ప్రాంతం పఠాన్‌కోట్ సమీపంలోని సైనిక కంటోన్మెంట్ ప్రాంతంగా మాత్రమే ఉంది.
ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ పాక్ అధికారిపై సెటైర్లు వేస్తున్నారు. “లేని ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశామని చెప్పడం హాస్యాస్పదం” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఫతా-1 క్షిపణులతో దాడులు చేశామని పేర్కొనగా, ఈ ప్రకటనలపై నిజానిజాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇదే తరహా తప్పుడు ప్రచారాలు గతంలో కూడా పాకిస్థాన్ చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్‌కు కారణమయ్యాయి.
Airbase Controversy | ‘ఎయిర్‌బేస్‌లు ఎక్కడ?’.. పాక్ అధికారిపై.. నెటిజన్ల సెటైర్లు
-








