టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి( Bhuma Mounika Reddy) రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. తాము ఇప్పటికే రాజకీయాల్లో భాగమయ్యామని కూడా తెలిపారు.
రేపు (మే 20) తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ నేడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల ప్రారంభించిన ‘ఐక్య’ (AIKYA – Dhairya Sena Samithi) సంస్థపై వస్తున్న సందేహాలకు వివరణ ఇచ్చారు.
ఐక్య సంస్థ రాజకీయాలతో సంబంధం లేని సంస్థ అని, ఇది కేవలం ప్రజల సమస్యలను వెలికి తీసి వారి గొంతుకగా పనిచేయడం కోసం మాత్రమే ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ సంస్థకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కార్యకలాపాల కోసం తన సొంత నిధులనే వినియోగిస్తానని పేర్కొన్నారు.








