Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeTelanganaLand Registration Values | తెలంగాణాలో పెరగనున్న భూముల ధరలు

Land Registration Values | తెలంగాణాలో పెరగనున్న భూముల ధరలు

-

Chat on WhatsApp

తెలంగాణలో భూముల మార్కెట్ విలువ (రిజిస్ట్రేషన్ ధరలు)(Land Registration Values) పెంపుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో శాస్త్రీయ పద్ధతిలో భూముల మార్కెట్ విలువను సవరించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం మరియు దాని పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR), ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని ప్రాంతాలను ఆధారంగా తీసుకుని కొత్త రిజిస్ట్రేషన్ విలువలు నిర్ణయించనున్నట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కనీసం రూ.15 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.

గతంలో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక ఆధారంగా రెండు సార్లు భూముల విలువ పెంపు జరిగిందని మంత్రి గుర్తుచేశారు. చివరిసారిగా 2022 ఫిబ్రవరిలో సవరణ జరిగిందని, అప్పటి నుంచి మార్పులు లేవని తెలిపారు.

బహిరంగ మార్కెట్ ధరలు మరియు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Retirement Age | ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు

Retirement Age: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే నిర్ణయాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62...
- Advertisement -
Chat on WhatsApp