Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeNationalPM Modi | ఒలింపిక్స్ హోస్ట్‌గా భారత్..“మేడ్ ఇన్ ఇండియా”పై మోదీ ప్రకటన

PM Modi | ఒలింపిక్స్ హోస్ట్‌గా భారత్..“మేడ్ ఇన్ ఇండియా”పై మోదీ ప్రకటన

-

Chat on WhatsApp

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా భారతదేశ భవిష్యత్తుపై తన అభిప్రాయాన్ని ప్రపంచ వేదికపై వెల్లడించారు. హేగ్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన మోడీ, భారత్ త్వరలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా, ప్రపంచ తయారీ కేంద్రంగా మరియు హరిత ఇంధన హబ్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ ఆర్థిక వృద్ధిని నడిపించే శక్తిగా మారే దిశగా దేశం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, తయారీ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఏఐ, రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత యువత చేస్తున్న కృషి కారణంగా దేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా నిలిచిందని ఆయన అన్నారు. సెమీకండక్టర్ రంగంలో కూడా భారత్ వేగంగా ఎదుగుతోందని, దేశవ్యాప్తంగా 12 ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.

ఈ ప్లాంట్లలో రెండు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయని, ఇకపై భారతదేశంలో తయారయ్యే చిప్స్ “డిజైన్డ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా”గా గుర్తింపు పొందుతాయని ప్రధాని ప్రకటించారు. ఇది భారత సాంకేతిక స్వావలంబనకు పెద్ద మైలురాయిగా ఆయన అభివర్ణించారు.

విదేశాల్లో ఉన్న భారతీయులు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మోడీ ప్రశంసించారు. వారి సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు ప్రపంచవ్యాప్తంగా భారత గుర్తింపును మరింత బలపరుస్తున్నాయని ఆయన అన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp