Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeNationalIndian Army | ఉగ్రవాదం ఆపకపోతే పాకిస్తాన్ మాయం అవుతుంది: భారత్ వార్నింగ్

Indian Army | ఉగ్రవాదం ఆపకపోతే పాకిస్తాన్ మాయం అవుతుంది: భారత్ వార్నింగ్

-

Chat on WhatsApp

Indian Army: భారత్‌పై ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్‌పై భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర కీలక హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ తన వైఖరిని(బుద్ధిని) మార్చుకోకపోతే ప్రపంచ పటంలో తన స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే భారత సైన్యం మరింత కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

గతంలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ, అలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురైతే భారత సాయుధ దళాల ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. 2024 మే 7న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌తో పాటు పీవోకే ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. దీనిని ఆపరేషన్ సిందూర్‌గా పేర్కొన్నారు.

ఈ సైనిక చర్యల తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య దాదాపు 88 గంటల పాటు తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్న తర్వాత మే 10న అవగాహన ఒప్పందంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ap eapcet 2026 results announced by minister nara lokesh

AP EAPCET 2026 ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే

AP EAPCET Results 2026 Out: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET 2026 పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...
- Advertisement -
Chat on WhatsApp