Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeTelanganaKavitha | అక్కడ TVK విజయ్.. ఇక్కడ నేను... కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha | అక్కడ TVK విజయ్.. ఇక్కడ నేను… కవిత కీలక వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

Kavitha: తమిళనాడులో విజయ్ తరహాలోనే తాను కూడా తెలంగాణలో రాజకీయంగా ఎదుగుతానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులే ప్రజల కోసం గట్టి నిర్ణయాలు తీసుకోవాలనే సంకల్పాన్ని ఇచ్చాయని, అందుకే ఈ పార్టీని స్థాపించినట్లు తెలిపారు.

కేవలం రాజకీయ కాలక్షేపం కోసం పార్టీ పెట్టలేదని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సమూల మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తమిళనాడులో విజయ్ లాగా ప్రజల్లోకి వెళ్లి తాను కూడా తెలంగాణలో అధికారాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా ఆమె భిన్న వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కాలంలో ఉన్న కేసీఆర్‌తో సమస్య లేదని, కానీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పాలనపై అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పారు. రాజకీయాలను తండ్రి దగ్గరే నేర్చుకున్నానని, అందుకే ఆయనను కూడా ప్రశ్నించే ధైర్యం ఉందని పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ మరియు ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఆశించిన ఫలితాలు రాలేదని, వేల కోట్ల ఖర్చు చేసినా నీటి సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయనను “ఆర్ఎస్ఎస్ సీఎం”గా అభివర్ణించారు. బీజేపీతో పరోక్ష సమన్వయం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని, ప్రభుత్వం మహిళా వ్యతిరేక ధోరణిలో ఉందని విమర్శించారు.

లిక్కర్ కేసు రాజకీయ కుట్రేనని కవిత వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్, కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేసులు వేస్తున్నారని ఆరోపిస్తూ, చివరికి నిజమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2028 లేదా 2029 ఎన్నికల్లో తాము అధికారాన్ని సాధిస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp