Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsIndia EV Cars | ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ చీప్ ఎలక్ట్రిక్ కార్లు...ధర ఎంతంటే...

India EV Cars | ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ చీప్ ఎలక్ట్రిక్ కార్లు…ధర ఎంతంటే ?

-

Chat on WhatsApp

India EV Cars: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా వైపు మొగ్గు చూపుతున్నారు. రోజువారీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి, తక్కువ నిర్వహణతో సులభంగా ఉపయోగించడానికి ఈవీ కార్లు మంచి ఆప్షన్‌గా మారాయి.

ప్రభుత్వ సబ్సిడీలు, పెరుగుతున్న ఛార్జింగ్ నెట్‌వర్క్ కూడా ఈవీలకు డిమాండ్ పెంచుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో తక్కువ ధరలో మంచి రేంజ్ అందించే కొన్ని ఈవీ కార్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

టాటా టియాగో ఈవీ దేశంలో అందుబాటులో ఉన్న చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఇది 19.2 kWh మరియు 24 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 నుంచి 315 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. నగర ప్రయాణానికి అనువుగా ఉండే ఈ కారు ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

MG కామెట్ EV పూర్తిగా సిటీ డ్రైవింగ్ కోసం రూపొందించబడింది. 17.3 kWh బ్యాటరీతో ఇది సుమారు 230 కి.మీ రేంజ్ ఇస్తుంది. చిన్న సైజ్ కారణంగా ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయవచ్చు. దీని ధర రూ.7.62 లక్షలు కాగా, BaaS మోడల్‌లో మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

సిట్రోయెన్ eC3 మంచి స్పేస్ మరియు కంఫర్ట్ కోరుకునేవారికి సరైన ఎంపిక. 29.2 kWh బ్యాటరీతో ఇది 246 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11.99 లక్షలు.

టాటా పంచ్ EV SUV లుక్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. 30 kWh మరియు 40 kWh బ్యాటరీ ఆప్షన్లతో 375 నుంచి 468 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ.9.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Vijay Mehta | భారతీయ నాటక రంగానికి తీరని లోటు.. విజయ్ మెహతా ఇకలేరు,...

భారతీయ నాటక, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి, దర్శకురాలు విజయ్ మెహతా(Vijay Mehta) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి ముంబైలోని స్వగృహంలో...
- Advertisement -
Chat on WhatsApp