Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTPawan Kalyan | ఏప్రిల్ 16 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ స్ట్రీమింగ్...ఏ ఓటీటీలో అంటే

Pawan Kalyan | ఏప్రిల్ 16 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ స్ట్రీమింగ్…ఏ ఓటీటీలో అంటే

-

Chat on WhatsApp

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన“ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Singh) సినిమా థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందింది.

నెగటివ్ రివ్యూలు రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్‌ను దాటలేకపోయింది. దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ రెండోసారి కలిసి పనిచేసిన ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం విడుదలైంది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదల అప్డేట్ అధికారికంగా వచ్చింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16 నుంచి ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగు సహా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది.



మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. విలన్ పాత్రలో పార్థిబన్ కనిపించగా, కేఎస్ రవికుమార్, గౌతమి, రావు రమేష్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. థియేటర్లలో ఆశించిన ఫలితం రాకపోయినా, ఓటీటీలో ఈ సినిమా ఎంత వరకు ఆదరణ పొందుతుందో చూడాలి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp