RGV Health Rumours: వివాదాస్పద వ్యాఖ్యలు, భిన్నమైన ఆలోచనలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే దర్శకుడు RGV మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఆయన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
స్టైలిష్‌గా కనిపించినప్పటికీ, ఈసారి వర్మ చాలా సన్నగా, బలహీనంగా కనిపించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ముఖ కవళికలు, శారీరక రూపంలో కనిపించిన మార్పులు నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీశాయి.
అయితే తన రూపం, ఆరోగ్యం గురించి వస్తున్న చర్చలను rgv మాత్రం తనదైన స్టైల్లోనే రిప్లై ఇచ్చారు. ప్రతి ఏడాది పుట్టినరోజు సందర్భంగా జీవితంపై, మరణంపై తన ప్రత్యేక కోణాన్ని బయటపెట్టే వర్మ, ఈసారి కూడా అదే తరహా వ్యాఖ్యతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
“చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను” అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో అభిమానుల్లో ఒకవైపు ఆందోళన, మరోవైపు ఆసక్తి పెరిగింది.
ఇప్పుడీ మారిన లుక్ వెనుక నిజంగా ఆరోగ్య సమస్య ఉందా? లేక కొత్త సినిమా లేదా ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం మేకోవర్ అయ్యారా? అన్నది మాత్రం ఇంకా స్పష్టతకు రాలేదు. కానీ ఆర్జీవీ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి రావడం మాత్రం ఖాయం.








