Friday, July 31, 2026
Chat on WhatsApp
HomeWeatherHeat Wave | మార్చి మొదట్లోనే మండుతున్న ఎండలు...40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Heat Wave | మార్చి మొదట్లోనే మండుతున్న ఎండలు…40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

-

Chat on WhatsApp

Heat Wave: తెలంగాణలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటినట్లు సమాచారం. వేడి ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

వాతావరణ పరిస్థితులపై IMD(India Meteorological Department) అధికారులు స్పందిస్తూ, గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేసవిలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వచ్చే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

వేడి ప్రభావం అధికంగా ఉండే నేపథ్యంలో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవడం, శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

India Condemns Pakistan Army Over Reported Civilian Killings in PoK

PoK | శాంతియుత నిరసనలపై కాల్పులు.. పాక్ చర్యలపై భారత్ ఆగ్రహం

PoK: పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన ప్రజలపై కాల్పులు జరపడం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొంది. ఈ ఘటనలపై...
- Advertisement -
Chat on WhatsApp