Saturday, April 18, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTJr NTR Dragon | డ్రాగన్‌లో అఖిల్...? స్పష్టత ఇచ్చిన చిత్ర యూనిట్

Jr NTR Dragon | డ్రాగన్‌లో అఖిల్…? స్పష్టత ఇచ్చిన చిత్ర యూనిట్

-

Chat on WhatsApp

Jr NTR Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా అభిమానులు పిలుచుకునే Jr ఎన్టీఆర్, మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నచిత్రం ‘Dragon’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రశాంత్ నీల్–అఖిల్ స్నేహం కారణంగా ఈ ప్రచారం ఊపందుకున్నప్పటికీ, చిత్రబృందం వర్గాల ప్రకారం ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది.

‘డ్రాగన్’ కథలో అఖిల్‌కు ఎలాంటి పాత్ర లేదని, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పూర్తి దృష్టిని ఎన్టీఆర్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దడంపైనే కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.

ఇటీవల జోర్డాన్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ఈ చిత్రం, త్వరలో హైదరాబాద్‌లో తదుపరి చిత్రీకరణను ప్రారంభించనుంది. వచ్చే ఏడాది వేసవి నాటికి సినిమాను పూర్తి చేసి, భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇక అఖిల్ తన ‘Lenin’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అఖిల్–ఎన్టీఆర్ కాంబినేషన్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ ఇవ్వబోయే ఊరమాస్ ట్రీట్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ:Pakistani F-16 fighter jet | సరిహద్దుల్లో భగ్గుమంటున్న పాక్-అఫ్గాన్ మధ్య ఉద్రిక్తతలు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

oil tanker navigating through strait of hormuz amid iran naval tensions

Iran | ట్యాంకర్‌పై కాల్పులు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం?

Iran: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు ఒక చమురు ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రపంచ...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102