Bank holidays | మార్చి 2026లో బ్యాంకులకు భారీ సంఖ్యలో సెలవులు ఉండనున్నాయి. Reserve Bank of India విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం మొత్తం 18 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. అన్ని ఆదివారాలు, అలాగే రెండవ మరియు నాల్గవ శనివారాలు సాధారణంగా బ్యాంకులకు సెలవులుగా ఉంటాయి. ఈసారి మార్చి 1, 8, 15, 22, 29 తేదీలు ఆదివారాలు కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
మార్చి 2026 బ్యాంకు హాలిడే లిస్ట్
1. “మార్చి 1 (ఆదివారం)” – దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
2. “మార్చి 2” – హోలికా దహన్ (కాన్పూర్, లక్నో)
3. “మార్చి 3” – హోలీ (పలు నగరాల్లో సెలవు)
4. “మార్చి 4” – హోలీ కొనసాగింపు/ప్రాంతీయ పండుగలు (పలు రాష్ట్రాలు)
5. “మార్చి 8″ (ఆదివారం)” – దేశవ్యాప్తంగా బంద్
6. “మార్చి 13” – చాప్చర్ కట్ (ఐజ్వాల్)
7. “మార్చి 14 (రెండవ శనివారం)” – రెండవ శనివారం సందర్భంగా దేశమంతటా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
8. “మార్చి 15 (ఆదివారం)” – దేశవ్యాప్తంగా బంద్
9. “మార్చి 17” – షబ్-ఎ-ఖాదర్ (జమ్మూ, శ్రీనగర్)
10. “మార్చి 19″– గుడి పడ్వా, ఉగాది పండుగల సందర్భంగా అనేక నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
11. “మార్చి 20” – ఈద్-ఉల్-ఫితర్ / జుమాత్-ఉల్-విదా (కొన్ని నగరాలు)
12. “మార్చి 21” – రంజాన్ ఈద్ (పలు ప్రాంతాలు)
13. “మార్చి 22 (ఆదివారం)” – దేశవ్యాప్తంగా బంద్
14. “మార్చి 26” – ప్రాంతీయ సెలవు
15. “మార్చి 27” – ప్రాంతీయ సెలవు
16. “మార్చి 29 (ఆదివారం)” – దేశవ్యాప్తంగా బంద్
17. “మార్చి 31” – ప్రాంతీయ సెలవు
మొత్తం: “18 రోజుల పాటు బ్యాంకులు మూసివేత” (ఆదివారాలు, రెండవ శనివారం, పండుగలు కలిపి)
చెక్ క్లియరెన్స్, రుణాల ప్రక్రియలు, డిమాండ్ డ్రాఫ్ట్ వంటి సేవల కోసం బ్రాంచ్‌కు వెళ్లే ముందు సెలవుల జాబితాను పరిశీలించడం అవసరం. అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి అత్యవసర లావాదేవీలు డిజిటల్ మార్గంలో పూర్తి చేసుకోవచ్చు.
ALSO READ:Jr NTR Dragon | డ్రాగన్‌లో అఖిల్…? స్పష్టత ఇచ్చిన చిత్ర యూనిట్








