Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeOthersఏపీ భవన్‌లో దుకాణంపై నాదెండ్ల ఆకస్మిక తనిఖీ

ఏపీ భవన్‌లో దుకాణంపై నాదెండ్ల ఆకస్మిక తనిఖీ

-

Chat on WhatsApp

ఢిల్లీ ఏపీ భవన్‌లో ఉన్న పౌరసరఫరాల శాఖ దుకాణాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. బియ్యం బస్తాలను పరిశీలించి నాణ్యతను, తూకాన్ని పరిశీలించిన మంత్రి, బస్తాలలో తూకం తేడా రావడాన్ని గమనించారు. దీంతో అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుకాణం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న విషయాన్ని గుర్తించిన మంత్రి, వెంటనే దానిని సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పేరుతో నిర్వాహణ అవ్యవస్థగా ఉందని, దీనిని తక్షణమే సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన సరఫరా చేయాలంటే ప్రభుత్వ నియంత్రణ అవసరమని తెలిపారు.

ఇకపై ఆ దుకాణాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడపనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఒక నెలలోనే ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుందన్నారు. నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడమని స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో మంత్రి నాదెండ్లతో పాటు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. మంత్రి చర్యతో అక్కడి అధికారుల్లో ఉలిక్కిపాటు ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ram charan peddi ott release on netflix from july 9

Peddi OTT Release | ఓటీటీలోకి ‘పెద్ది’.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?

Peddi OTT Release: థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా...
- Advertisement -
Chat on WhatsApp