Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeOthersవంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగింపు

వంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగింపు

-

Chat on WhatsApp

గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా, విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది.

గతంలో కోర్టు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా, అది నేటితో ముగియడంతో పోలీసులు వంశీని మళ్లీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్ గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో వంశీకి మరికొన్ని రోజులు జైల్లో ఉండాల్సిందేనని స్పష్టమైంది.

ఇక మరోవైపు, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులోనూ వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో సీఐడీ కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. దీంతో రెండు కేసుల్లోనూ వంశీపై విచారణ కొనసాగనుంది.

ప్రస్తుతం వంశీ అరెస్ట్ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వర్గాలు వంశీపై తీవ్ర విమర్శలు చేస్తుండగా, వైసీపీ వర్గాలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. వంశీపై తదుపరి విచారణలో ఏమి జరుగుతుందనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Telangana government will launch the ‘Tholimudda’ breakfast scheme in Anganwadi centres from August to improve child nutrition and strengthen childcare facilities across the state.

Tholimudda | అంగన్‌వాడీ చిన్నారులకు ‘తొలిముద్ద’ అల్పాహారం.. ఎప్పటినుంచి అంటే ?

తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుంచి అంగన్‌వాడీల్లో ‘తొలిముద్ద’(Tholimudda) అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క(Minister...
- Advertisement -
Chat on WhatsApp