Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోనమ్మ తోటలో మ్యాక్స్ ఎక్స్ప్లోర్ 2024 ఘనంగా నిర్వహణ

కోనమ్మ తోటలో మ్యాక్స్ ఎక్స్ప్లోర్ 2024 ఘనంగా నిర్వహణ

-

Chat on WhatsApp

కోవూరు మండలంలోని కోనమ్మ తోటలో న్యూ లిటిల్ ఫ్లవర్స్ హై స్కూల్ నందు శ్రీనివాస రామనాథన్ జయంతి సందర్భంగా మ్యాక్స్ ఎక్స్ప్లోర్ 2024 ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథులుగా కోవ్వూరు ఎస్‌ఐ రంగనాథ్ గౌడ్ మరియు గాదిరాజ్ అశోక్ కుమార్ హాజరై, విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.

ముఖ్య అతిథులు ప్రోగ్రామ్‌లో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్కూలు యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు మేలుకలిగిస్తాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో స్కూలు చేస్తున్న కృషిని వారు మెచ్చుకున్నారు.

స్కూలు ప్రిన్సిపాల్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్కూలు ప్రత్యేకంగా విద్యార్థుల దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ప్రత్యేక దృష్టి పెట్టింది అని పేర్కొన్నారు. సుమారు 150 కి పైగా ప్రాజెక్టులతో ఈ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.

మ్యాక్స్ ఎక్స్ప్లోర్ 2024లో వివిధ ప్రాజెక్టులు, ఆవిష్కరణలు విద్యార్థుల సృజనాత్మకతను చాటాయి. కార్యక్రమం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాక, విజ్ఞానాన్ని విస్తరించేందుకు ఉపకరించిందని పాల్గొన్న అతిథులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

hyderabad solar roof cycling track section removed near my home avatar junction

Solar Roof Cycling Track | మై హోమ్ అవతార్ జంక్షన్‌లో సైకిల్ ట్రాక్...

Solar Roof Cycling Track: హైదరాబాద్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌లో భాగంగా నిర్మించిన ఒక విభాగాన్ని అధికారులు తొలగించడం చర్చనీయాంశమైంది. నగర శివారులోని నార్సింగి సమీప మై...
- Advertisement -
Chat on WhatsApp