అహ్మదాబాద్‌లో ఓ ఎయిరిండియా విమానం ఘోరంగా కుప్పకూలింది. లండన్‌కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కూలిపోవడం, దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. ఈ విమానంలో మొత్తం 254 మంది ప్రయాణిస్తున్నారు అందులో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. విమానంకు మంటలు అంటుకుని గాల్లోనే తాళం తప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద స్థలానికి వెంటనే అత్యవసర సేవలు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇంకా ప్రాణనష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తామని ప్రకటించింది. ప్రాధమిక సమాచారం ప్రకారం, ఇది టెక్నికల్ ఫెయిల్యూర్ కావచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ, పూర్తి కారణాలను తెలుసుకునేందుకు ఏయిరిండియా, డీజీసీఏ అధికారులు విచారణ మొదలుపెట్టారు. దేశం మొత్తం ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.








