Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeInterNationalకమ్చట్కా సముద్రభూకంపం: తీవ్రత 7.4, సునామీ హెచ్చరిక

కమ్చట్కా సముద్రభూకంపం: తీవ్రత 7.4, సునామీ హెచ్చరిక

-

Chat on WhatsApp

రష్యా కమ్చట్కా ప్రాంతంలో పెద్ద భూకంపం సంభవించింది. కమ్చట్కా రాజధాని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 128 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో కేవలం 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

భూకంప తీవ్రత కారణంగా ఇళ్లలోని ఫర్నిచర్, ఇతర వస్తువులు తీవ్రంగా కంపించాయి. వీధుల్లో పార్క్ చేసిన కార్లు కూడా ఊగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రష్యాకు చెందిన భూభౌతిక సేవల విభాగం ఈ భూకంప తీవ్రత 7.4 అని నమోదు చేశింది. ఈ భూకంపానికి అనుగుణంగా ఐదుసార్లు స్వల్ప భూకంపాలు కూడా చోటు చేసుకున్నాయి.

అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

కమ్చట్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్, టెలిగ్రామ్ ద్వారా స్పందిస్తూ, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. భూకంప ప్రభావాలను అంచనా వేసేందుకు సర్వేలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Rain clouds over Telangana as monsoon becomes active

Telangana Rains | ఎల్‌నినో ఎఫెక్ట్‌కు చెక్.. తెలంగాణలో మళ్లీ వర్షాల జోరు!

Telangana Rains: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు ఊరట లభిస్తోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా మారడంతో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా, నేడు మరిన్ని...
- Advertisement -
Chat on WhatsApp