LIVE
Saturday, November 21, 2026
LIVE
LIVE

YouTube New Rules | యూట్యూబ్ నుంచి ఆదాయం కావాలా?.. కొత్త అర్హతలు తెలుసుకోండి

by Bajaswamy
14 views
YouTube announces new Partner Program rules with higher watch time and Shorts view requirements.

YouTube New Rules: యూట్యూబ్‌లో కొత్త ఛానెల్ ప్రారంభించి ఆదాయం పొందాలని భావిస్తున్న వారికి సంస్థ కీలక ప్రకటన చేసింది. YouTube Partner Program (YPP) నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త అర్హత ప్రమాణాలను ప్రకటించింది. 2018 తర్వాత తొలిసారి ఈ స్థాయిలో మార్పులు తీసుకురావడం గమనార్హం. పెరుగుతున్న షార్ట్స్ వినియోగం, టీవీల్లో యూట్యూబ్ వీక్షణ సమయం భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 2027 ఫిబ్రవరి 1 నుంచి YPPలో చేరే కొత్త క్రియేటర్లు ప్రకటనలు, యూట్యూబ్ ప్రీమియం ద్వారా ఆదాయం పొందాలంటే గతంతో పోలిస్తే ఎక్కువ అర్హత సాధించాలి. లాంగ్-ఫామ్ వీడియోల కోసం 365 రోజుల్లో 8,000 గంటల వాచ్ టైమ్ అవసరం. అలాగే షార్ట్స్ విభాగంలో 90 రోజుల్లో 20 మిలియన్ వ్యూస్ తప్పనిసరి. అయితే 1,000 సబ్‌స్క్రైబర్ల నిబంధనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికే YPPలో ఉన్న క్రియేటర్లకు ఈ కొత్త ప్రవేశ నిబంధనలు వర్తించవని యూట్యూబ్ స్పష్టం చేసింది.

అదే సమయంలో షార్ట్స్ ద్వారా ప్రకటనల ఆదాయం కొనసాగాలంటే ప్రతి 90 రోజులకు కనీసం 10 మిలియన్ వ్యూస్ నిలబెట్టుకోవాలి. వ్యూస్ తగ్గితే షార్ట్స్ మోనిటైజేషన్ తాత్కాలికంగా నిలిచిపోతుంది. అయితే లాంగ్-ఫామ్ వీడియోల ద్వారా ఆదాయం కొనసాగుతుంది. ఇక 500 సబ్‌స్క్రైబర్లతో ఉన్న దిగువ స్థాయి YPP అర్హతలు యథాతథంగా కొనసాగనున్నాయి. అలాగే YouTube Premium Lite సేవను మరిన్ని దేశాలకు విస్తరిస్తూ, భారత్‌లో నెలకు రూ.89కే అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More