దేశంలో మహిళలపై వేధింపులు, హింస, అఘాయిత్యాల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ మహిళల భద్రత(women safety helpline)ను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని బాధితులకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో 24/7 గంటలు పనిచేసే కొత్త హెల్ప్‌లైన్ నంబర్ “14490” ను అధికారికంగా ప్రారంభించింది.
అత్యవసర పరిస్థితులు, వేధింపులు, బెదిరింపులు లేదా ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలు ఈ నంబర్‌కు కాల్ చేసి వెంటనే సహాయం పొందవచ్చు.
ALSO READ:Kokapet Land Auction: ఎకరానికి 137 కోట్లు – మధ్యతరగతికి ఇల్లు దూరం..?
ఈ హెల్ప్‌లైన్ న్యూఢిల్లీలోని కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించబడుతుంది. కాల్ రిసీవ్ చేసిన వెంటనే బాధితురాలి సమస్యను పరిశీలించి, ఆమెను సంబంధిత వ్యవస్థలైన పోలీసులు, ఆసుపత్రులు, న్యాయ సాయం అందించే అధికారులు లేదా అవసరమైన ఇతర విభాగాలతో అనుసంధానించే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
జాతీయ మహిళా కమిషన్ ఈ సేవ మహిళలు ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భద్రత, మార్గదర్శకత్వం, న్యాయ సహాయం పొందేలా ఉపయోగపడుతుందని తెలిపింది.
కొత్త నంబర్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో మహిళల భద్రత వ్యవస్థ మరింత బలపడనుందని కమిషన్ అభిప్రాయపడింది.
