Snapdragon 4 Gen 2: Vivo సంస్థ తన బడ్జెట్ 5G సిరీస్‌లో భాగంగా కొత్త Vivo Y6e 5G ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లను అందించేలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రూపొందించింది. పెద్ద బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్లు దీనిని ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
ధర విషయానికి వస్తే, చైనాలో ఈ ఫోన్ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 6GB RAM, 256GB స్టోరేజ్‌తో వచ్చే ఈ మోడల్ ధర సుమారు CNY 1,599 (దాదాపు రూ.22,000)గా నిర్ణయించారు. ఫ్లోయింగ్ క్లౌడ్స్ వైట్, సన్‌సెట్ బ్లూ, ట్వైలైట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తోంది. డిస్‌ప్లే విభాగంలో 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు అధిక బ్రైట్‌నెస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. స్లిమ్ బెజెల్స్‌తో మంచి స్క్రీన్-టు-బాడీ రేషియోను అందించారు. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా కలదు.
పర్ఫార్మెన్స్ కోసం Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6nm ఆర్కిటెక్చర్ ఆధారంగా పనిచేసే ఈ చిప్‌సెట్‌తో పాటు Adreno GPU, 6GB RAM, 256GB UFS స్టోరేజ్ అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOSపై ఈ ఫోన్ పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే, వెనుక భాగంలో 13MP సింగిల్ రియర్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా అందించారు.
1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో పాటు డిజిటల్ జూమ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.500mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో దీర్ఘకాల వినియోగానికి అనుకూలంగా రూపొందించారు. 5G కనెక్టివిటీతో పాటు Wi-Fi, Bluetooth 5.1, USB Type-C వంటి అన్ని ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.
Snapdragon 4 Gen 2 | కొత్త బడ్జెట్ 5G ఫోన్ Vivo Y6e 5G రిలీజ్.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు, ధర
-








