Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshGrowth Summit 2026 | ఆంధ్రప్రదేశ్‌లో MSME రంగానికి కొత్త ఊపు.. చంద్రబాబు కీలక చర్యలు

Growth Summit 2026 | ఆంధ్రప్రదేశ్‌లో MSME రంగానికి కొత్త ఊపు.. చంద్రబాబు కీలక చర్యలు

-

Chat on WhatsApp

విజయవాడలో జరిగిన ‘వన్ ఫ్యామిలీ – వన్ ఆంత్రప్రెన్యూర్(One Family – One Entrepreneur) ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026’(MSME Growth Summit 2026) కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ కళావేదికను ప్రారంభించారు.

సమావేశంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 38 ఎంఎస్‌ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా మెటా, అమెజాన్, జోహో వంటి ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు.

ఈ సమ్మిట్‌లో 1,500 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ మౌలిక వసతులు కల్పించేందుకు ఎంఎస్‌ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే మొదటి, రెండో దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన పూర్తయిందని సమాచారం.

అదేవిధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురం ప్రాంతాల్లో గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ‘రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్‌టెన్షన్’ కేంద్రాలను సీఎం ప్రారంభించారు. అలాగే రూ.200 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp